తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ
- మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం
- హాజరైన టీ-జనసేన కీలక నేతలు
- నేతలకు పవన్ దిశానిర్దేశం
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో... ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. పోటీలో బీజేపీ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక ప్రకటన చేశారు. తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్ ను కలిశామని... మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆయన పూర్తి మద్దతు తెలిపారని వెల్లడించారు.