ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్
- ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్
- ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం
ఇలాంటి అమ్మకాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పవన్ చెప్పారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని... ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని... అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధింత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావు ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రజల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ప్రధానమని చెప్పారు.