పవన్ కల్యాణ్ పై అంబటి కుమార్తె వ్యాఖ్యలు
- పవన్ ఇచ్చిన బలంతో తన ఇంటిపై దాడి జరిగిందన్న అంబటి కుమార్తె
- కాపులంతా పవన్ వైపు ఉన్నారని వెల్లడి
- కాపు మహిళలమైన తమను తిడుతూ ఇంటిపై దాడి చేశారని మండిపాటు
పవన్ కల్యాణ్ ఇచ్చిన బలాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తమ ఇంటిపై కాపులు దాడి చేశారని మౌనిక అన్నారు. కాపు కులంలో పుట్టినందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. కాపు కులస్తులంతా పవన్ వైపు ఉన్నారని... కాపు మహిళలమైన తమను తిడుతూ తమ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి తన తండ్రి అసభ్య పదజాలంతో మాట్లాడలేదని చెప్పారు.
జగన్ ను చంద్రబాబు ఎన్నోసార్లు తిట్టారని మౌనిక అన్నారు. తిరుమల లడ్డూ గురించి వాస్తవాలు మాట్లాడినందుకే తమ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకే దాడికి దిగారని మండిపడ్డారు. తప్పుల్ని ప్రశ్నిస్తే చంద్రబాబు తల్లిని అన్నట్టుగా చెబుతూ ఇంటిపై దాడి చేశారని అన్నారు. తమ ఇంటిపై దాడి జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.