ఒక్కరోజులో రూ.8 వేలకు పైగా పెరిగిన బంగారం ధరలు
- హైదరాబాద్‌లో రూ.1,70,447కు చేరుకున్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
- నిన్న రూ.1,62,380 పలిగిన బంగారం ధర
- రూ.3.75 లక్షలు పలికిన కిలో వెండి
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 పలికింది. వెండి ధర రూ.4,00,000 దిశగా పరుగెడుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.3.75 లక్షలుగా ఉంది.
ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.26,821 పెరిగి రూ.3.83 లక్షలకు పలికి రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం రూ.1.62 లక్షలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర ఔన్సు 5,296.79 డాలర్లకు, వెండి ఔన్సు 114 డాలర్లకు చేరుకుంది. మరోవైపు, డాలర్ విలువ నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.