చుక్కలనంటిన పసిడి, వెండి.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు
- నిరాటంకంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరల పెరుగుదల
- భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్ల మొగ్గు
- హైదరాబాద్‌లో రూ.1.65 లక్షలు దాటిన 24 క్యారెట్ల తులం బంగారం ధర
- వెండి ధర కూడా జోరు.. కిలోకు రూ.10,000 పెరిగి రూ.4 లక్షలకు చేరిక
ఈరోజు ఉదయం 11:00 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 పెరిగి రూ.1,51,400 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,65,300 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,51,550గా నమోదైంది.
వెండిది కూడా అదే జోరు
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. నిన్నటితో పోల్చితే కిలో వెండిపై రూ.10,000 పెరిగి, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.4,00,000కి చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3.8 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.