నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
- ఉదయం 11 గంటలకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం
- నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్
- గత వారం ఏలూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైనం
ప్రతి బుధవారం రాష్ట్రంలోని ఒక నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ గత వారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరించిన వైఎస్ జగన్ .. పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.