భారీ హిమపాతంలో వివాహ వేడుక.. వీడియో ఇదిగో!
- రుద్రప్రయాగ్ లోని శివపార్వతుల వివాహం జరిగిన చోట ఒక్కటైన జంట
- మీరట్ నుంచి ఉత్తరాఖండ్ కు వధూవరుల కుటుంబాలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఈ వివాహానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధూవరులు ఇద్దరూ మంచులో నడుస్తూ ఆలయానికి వెళ్లడం ఇందులో కనిపిస్తోంది. కాగా, వసంత పంచమి రోజు రుద్ర ప్రయాగ్ లోని త్రియుగినారాయణ్ టెంపుల్ లో ఈ వివాహం జరిగింది. పురాణాల ప్రకారం ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగింది. ప్రతికూల వాతావరణంలో వివాహం చేసుకున్న ఆ జంట స్పందిస్తూ.. ఎట్టకేలకు తమకు ఆ పరమశివుడి ఆశీస్సులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు.