అమరావతి ఒక నమ్మకం... సీఎన్ఎన్-న్యూస్18 కథనంపై మంత్రి లోకేశ్ స్పందన
- అమరావతి కేవలం నిర్మాణం కాదని, అదొక నమ్మకమని చెప్పిన లోకేశ్
- అమరావతిపై గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం చేసిన సీఎన్ఎన్కు ప్రశంసలు
- అన్ని కోణాలను చూపించారంటూ జర్నలిస్ట్ రోహిణి స్వామికి అభినందనలు
- రైతుల కష్టాలు, గృహ సముదాయాలను కథనంలో చూపించారని వెల్లడి
- ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అమరావతి ప్రతిరూపమని వ్యాఖ్య
అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, అలాగే ఈ ప్రాంత రైతుల కలలకు ప్రతిరూపమని ఆయన అభివర్ణించారు. అమరావతికి సంబంధించిన అన్ని కోణాలను తమ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు సీఎన్ఎన్-న్యూస్18 బృందానికి, జర్నలిస్ట్ రోహిణి స్వామికి లోకేశ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కథనంలో రాజధాని కోసం రైతులు పడిన కష్టాలను, వారి పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని ఆయన అన్నారు. అదే సమయంలో, ప్రస్తుతం నిర్మాణం పూర్తిచేసుకుని అందుబాటులోకి వస్తున్న గృహ సముదాయాల ప్రత్యేక ఫుటేజీని కూడా ప్రసారం చేశారని ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఆయన సూచించారు.