‘ఐబొమ్మ’ రవి బెయిల్ పిటిషన్ కొట్టివేత
- బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో రవి పిటిషన్
- రవికి విదేశీ పౌరసత్వం ఉందని కోర్టుకు తెలిపిన పోలీసులు
- బెయిల్ ఇస్తే విదేశాలకు పరారయ్యే అవకాశం ఉందని వెల్లడి
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రవిపై నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ మంజూరు చేస్తే రవి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.