ప్రతి పరిచయం వెనుక ఒక పరమార్థం వుంటుంది: సాయికుమార్
- శంబాల మూవీ థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడిన సాయి కుమార్
- విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పక్క సీటులో వారి ఫోన్ నెంబర్ తీసుకుంటానన్న సాయి కుమార్
- అనేక మంది ప్రముఖులు ఫ్లైట్‌లో పరిచయం అయ్యారని వెల్లడి
తాను విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కచ్చితంగా పక్కవారిని పరిచయం చేసుకుని వారి ఫోన్ నెంబర్ తీసుకుంటానని సాయి కుమార్ తెలిపారు. ఆ తర్వాత రోజు ఉదయం నుంచే ఆ పరిచయం చేసుకున్న వారితో సంభాషణలు చేస్తూ ఉంటానన్నారు. ఇలా తనకు ఎంతో మంది ప్రముఖులు ఫ్లైట్‌లో పక్క సీట్లో పరిచయం అయ్యారని చెప్పారు. ప్రతి పరిచయం వెనుక ఒక పరమార్థం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.