జనవరి 11న 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీమియర్స్... ఓవర్సీస్ లో ప్రభంజనం
- యూకేలో సత్తా చాటుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'
- 10,000కు పైగా టికెట్ల విక్రయం
- చిరంజీవి, వెంకటేశ్ కాంబోపై భారీ అంచనాలు
- సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్గా వస్తున్న చిత్రం
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో విక్టరీ వెంటేశ్ ఓ కీలక పాత్రల కనిపించనున్నారు. చిరంజీవి వింటేజ్ లుక్, వెంకటేశ్ మార్క్ కామెడీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. యూకేలో ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 11న గ్రాండ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అహింసా ఫిల్మ్స్, సరిగమ సినిమాస్, బోలిన్ సినిమా (UK) కలిసి ఈ చిత్రాన్ని యూకేలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి ఇది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.