అవన్నీ తప్పుడు వార్తలే.. డ్రామాలు: ఉద్యోగుల తొలగింపు వార్తలపై జొమాటో బాస్!
- 500 మందిని తీసేశారన్న వార్త అబద్ధమన్న దీపిందర్ గోయల్
- 20 మందిపైనే చర్యలు తీసుకున్నామని వెల్లడి
- 28 నిమిషాలు ఆలస్యంగా వస్తే తీసేస్తారా? అన్న ప్రశ్నకు దీపిందర్ స్ట్రాంగ్ కౌంటర్
- రెడిట్, ఇతర వేదికలపై జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనన్న గోయల్
ఒక ఉద్యోగి కేవలం 28 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు తీసేశారన్న వార్తపై కూడా దీపిందర్ ఘాటుగా స్పందించారు. "కస్టమర్ కేర్ అనేది క్లాక్-టు-క్లాక్ జాబ్. అక్కడ కెపాసిటీ ప్లానింగ్ ఉంటుంది. ఒక వ్యక్తి 28 నిమిషాలు ఆలస్యం అయితే, ఆ సమయంలో కస్టమర్లకు సాయం చేసే వారు ఉండరు. అందరూ ఇలాగే చేస్తే సంస్థ ఎలా నడుస్తుంది?" అని ప్రశ్నించారు. సదరు వ్యక్తికి ముందే హెచ్చరికలు జారీ చేశామని, పద్ధతి మార్చుకోనందునే చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఒకవైపు పాడ్‌కాస్ట్‌లో దీపిందర్ తన వాదన వినిపిస్తుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నుంచి జొమాటో తీవ్ర నిరసనలు ఎదుర్కొంటోంది. తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడంపై డిసెంబర్ 25, 31 తేదీల్లో డెలివరీ బాయ్స్ భారీ సమ్మె చేపట్టారు. ఈ ఉద్రిక్తతల మధ్య దీపిందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కార్పొరేట్, సోషల్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.