స్విగ్గీ, జొమాటోలను మర్చిపోలేకపోతున్నా.. విదేశీయుడి వైరల్ వీడియో
- భారతీయుల నిత్యజీవితంతో పెనవేసుకుపోయిన క్విక్ కామర్స్ సంస్థలు
- ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలో గుమ్మం వద్దకు డెలివరీ
- కరివేపాకు నుంచి ఐఫోన్ దాకా అన్నీ నిమిషాల్లోనే తెచ్చిస్తున్న డెలివరీ సంస్థలు
కొంతకాలం భారత దేశంలో ఉన్న తనకు అక్కడి నుంచి తిరిగి వచ్చాక క్విక్ కామర్స్ యాప్ లు, వాటి సేవలను మర్చిపోవడం కష్టంగా మారిందన్నాడు. భారత్ లోని తాజ్ మహల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కాకుండా బ్లింకిట్, స్విగ్గీమార్ట్, జొమాటో వంటి యాప్ లు, వాటి ద్వారా పొందే సేవలను ఎక్కువగా కోల్పోతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.