అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు
- తిరుమల ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి
- కార్యక్రమంలో పాల్గొన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి
ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. నడకదారి ద్వారా తిరుమల చేరుకునే భక్తుల సౌకర్యార్థం ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఇప్పటికే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు టీటీడీ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.