పెళ్లికి ముందే గర్భం దాలిస్తే భారీ జరిమానా.. ఎక్కడంటే..!
- పెళ్లయ్యాక 10 నెలల లోపు ప్రసవించినా ఫైన్ తప్పదు
- సహజీవనం చేస్తే ఏటా రూ.6 వేలు చెల్లించాలట
- పొరుగు రాష్ట్రం వారిని పెళ్లి చేసుకుంటే రూ.19 వేలు ఫైన్
- చైనాలోని ఓ గ్రామంలో నిబంధనలతో బోర్డు ఏర్పాటు
ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ.19 వేలు), దంపతులు గొడవపడి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు (సుమారు రూ.6 వేలు), మద్యం సేవించి గ్రామంలో గొడవ చేస్తే 3 వేల నుంచి 5 వేల యువాన్లు (రూ.38,472 నుంచి రూ.64,120), నిరాధార ఆరోపణలు, పుకార్లు సృష్టిస్తే 500 నుంచి 1,000 యువాన్లు (రూ.6,412 నుంచి రూ.12,824) జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓ బోర్డును తయారు చేసి గ్రామంలోని కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నియమాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే ఆ బోర్డును తొలగించారు.