మారేడుమిల్లికి వెళ్లే పర్యాటకులకు పోలీసుల హెచ్చరిక
- మందు పాతరలను గుర్తించిన భద్రతాబలగాలు
- కొనసాగుతున్న మందు పాతరలను వెలికి తీసే కార్యక్రమం
- పని పూర్తయ్యేంత వరకు ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక
ప్రస్తుతం కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు... వీటిని వెలికితీసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మైన్లను వెలికి తీశాయి. మరోవైపు, మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాలను జల్లెడపట్టి మిగిలిన మందు పాతరలను కూడా వెలికి తీసే చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మందు పాతరలను వెలికి తీసేంతవరకు పర్యాటకులు, ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.