గజ్వేల్ నియోజకవర్గం సహా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది: వివేక్
- కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్‌కు గుబులు పట్టుకుందన్న మంత్రి
- గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించిందని వెల్లడి
- బీఆర్ఎస్‌కు పట్టున్న జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న వివేక్
రెండేళ్లకు పైగా ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్, ఇప్పుడొచ్చి తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి పట్టున్న జూబ్లీహిల్స్‌లో కూడా కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.