రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు వ్యాఖ్యలు... ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
- కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడో రాడో చెప్పాలని ఎంపీ చామల నిలదీత
- బీఆర్ఎస్ హయాంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారన్న ఎంపీ
- కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో ప్రజలకు తెలుస్తుందని వ్యాఖ్య
గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని ఆయన అన్నారు. అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని, ఇప్పుడు అవే మాటలను కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా సరైన పాలన అందించలేదని ఆయన అన్నారు. అందుకే ప్రజలు ప్రజా పాలనకు ఓటేశారని ఎంపీ అన్నారు.