తిరుమల తిరుపతి దేవస్థానంకు ఇండియన్ బ్యాంక్ విరాళం
- అలిపిరి చెక్ పోస్ట్ వద్ద లగేజీ స్కానర్ ఏర్పాటు కోసం విరాళం
- రూ.37,97,508 డీడీ అధికారులకు అందజేత
- టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి డీడీ అందించిన బ్యాంకు ప్రతినిధులు
తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ ప్రణేశ్ కుమార్, రూ.37,97,508 డీడీని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం.సెల్వరాజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇందిరా, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.