దేశంలోని టాప్ 200 స్టార్టప్‌ల విలువ ఎన్ని లక్షల కోట్లు అంటే?
- 42 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న టాప్ 200 కంపెనీల వ్యాల్యూ
- గత ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి
- అత్యధిక కంపెనీలు కలిగిన నగరంగా స్థానాన్ని నిలబెట్టుకున్న బెంగళూరు
2025లో 128 కంపెనీలు బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌ను కలిగి ఉన్నాయి. గత ఏడాది ఈ సంఖ్య 121గా ఉంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా జాబితా ప్రకారం 22 కొత్త కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. రూ. లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీలు ఐదు ఉన్నాయి.
అత్యధిక స్టార్టప్‌లు కలిగిన నగరంగా బెంగళూరు నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే 14 కంపెనీలు తగ్గినప్పటికీ 52 కంపెనీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా ముంబై (41), గురుగ్రామ్ (36) ఉన్నాయి. ముంబై, గురుగ్రామ్‌లలో గత ఏడాదితో పోలిస్తే ఐదు స్టార్టప్‌లు పెరిగాయి.
88 మంది స్టార్టప్ వ్యవస్థాపకులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ముంబై (83), ఢిల్లీ (52) ఉన్నాయి. ఈ నగరాలు అత్యధిక సంఖ్యలో స్టార్టప్ వ్యవస్థాపకులను కలిగి ఉన్నాయి. దేశంలోని స్టార్టప్ కంపెనీలలో 47 ఫైనాన్షియల్ సర్వీసెస్, 28 సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్, 27 హెల్త్ కేర్, 20 రిటైల్ రంగాల్లో ఉన్నాయి.