చెన్నై రెస్టారెంట్ బిల్ చూసి ఎన్ఆర్ఐ బాలుడి షాక్.. వీడియో ఇదిగో!
- ఏడు పదార్థాలు ఆర్డర్ చేసినా బిల్లు 15 వందలేనా? అంటూ ఆశ్చర్యం
- న్యూజిలాండ్ లో అయితే మూడు పదార్థాలకే 200 డాలర్లు బిల్లు వేస్తారని వెల్లడి
- మా సాలరీ స్లిప్పులు చూస్తే ఆ బిల్లు ఎక్కువే అంటావంటూ నెటిజన్ల కామెంట్లు
న్యూజిలాండ్ లో పుట్టిపెరిగిన ఆ బాలుడికి చెన్నై రెస్టారెంట్ బిల్లు చౌక అనిపించడంలో ఆశ్చర్యం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఏడు ఐటమ్ లకు రూ.1500 బిల్లు అంటే భారతీయులకు మాత్రం ఖరీదైన వ్యవహారమేనని చెబుతున్నారు. ఇక్కడి రెస్టారెంట్ల బిల్లులు చూసి ఆశ్చర్యపోయిన ఆ బాలుడికి ఇక్కడి ఉద్యోగుల శాలరీ స్లిప్పులు చూపిస్తే అప్పుడు ‘బాబోయ్ ఇంత ఖరీదా?’ అని ఆశ్చర్యపోతాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్ ఫన్నీగా స్పందిస్తూ.. ‘బహుశా ఆ బాలుడు మళ్లీ న్యూజిలాండ్ వెళ్లడేమో’ అంటూ కామెంట్ చేశాడు.