ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన శుభలేఖ సుధాకర్
- ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం
- రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహావిష్కరణ
- విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సుధాకర్
గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడి శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతేకాకుండా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. సినిమాల్లోనే కాకుండా టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ, గాయకులను వెలుగులోకి తెచ్చారు. ఆయన 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు.