మాజీ ముఖ్యమంత్రి జగన్ కు యనమల హితవు.. ఏమన్నారంటే!
- మాక్ అసెంబ్లీ నడిపిన తీరుకు విద్యార్థులపై ప్రశంసలు
- వారిని చూసైనా నేర్చుకోవాలంటూ జగన్ కు సూచన
- జగన్ బాధ్యతాయుతంగా అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించాలన్న యనమల
ప్రజలకు ప్రతినిధిగా జనం సమస్యలపై బయటకన్నా సభలో మాట్లాడడం వల్ల ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు. లేదంటే త్వరలోనే అర్హత కోల్పోయే పరిస్థితి వస్తుందని జగన్ ను ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాక్ అసెంబ్లీ నడిపిన తీరును యనమల కొనియాడారు. ఎలాంటి బహిష్కరణలకు తావివ్వకుండా, ప్రజా సమస్యలను సభలోనే ప్రస్తావిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు.