పురుటి నొప్పులతో భార్య.. అయినా వర్క్ ఫ్రం హాస్పిటల్ చేయాలన్న మేనేజర్
- ఆసుపత్రిలో నువ్వు చేసేదేముంటుందని ఎద్దేవా
- రెడ్డిట్ లో వైరల్ గా మారిన ఉద్యోగి పోస్ట్
- మేనేజర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు
ఇండియన్ వర్క్ ప్లేస్ అనే రెడ్డిట్ యూజర్ పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఓ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి భార్య నిండు గర్భిణీ. డెలివరీ కోసం ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. ఆపై విషయం స్పష్టంగా వివరిస్తూ రెండు రోజులు సెలవు కావాలంటూ మేనేజర్ కు మెసేజ్ చేశాడు. దీనికి మేనేజర్ ఇచ్చిన జవాబు చూసి తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ‘ఇప్పుడు సెలవు ఇవ్వడం కుదరదు. వచ్చే వారం తీసుకుందువులే. అయినా మీ ఆవిడ డెలివరీకి నువ్వు చేసేదేముంది? ఆసుపత్రి నుంచే వర్క్ చేయొచ్చు కదా’ అంటూ ఆ మేనేజర్ జవాబిచ్చాడు.
‘అలా కుదరదండి, ఆసుపత్రిలో పేషెంట్ ను చూసుకోవాల్సింది నేనే. మెడికల్ షాపుకు వెళ్లడం, ఇతరత్రా పనులు ఉంటాయి. పైగా ఆసుపత్రి నుంచి ఆఫీసు వర్క్ చేయడం వీలుకాదు’ అని ఆ ఉద్యోగి చెప్పడంతో అయిష్టంగానే మేనేజర్ సెలవు మంజూరు చేశాడు.