తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు.. ఎప్పటి నుంచంటే!
- డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
- వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం
- సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్యులకే పెద్దపీట
వైకుంఠ ద్వార దర్శన సమయం మొత్తం 182 గంటలు కాగా ఇందులో 164 గంటలు సాధారణ భక్తులకే కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందని టీటీడీ పాలకమండలి పేర్కొంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఈ వివరాలను వెల్లడించారు.