నల్లుల బెడదతో గూగుల్ ఆఫీస్ క్లోజ్.. ఎక్కడంటే..!
- వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఉద్యోగులకు కంపెనీ సూచన
- అమెరికాలోని మన్ హట్టన్ గూగుల్ క్యాంపస్ లో నల్లులు
- ఆఫీసులో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని వెల్లడి
ఉద్యోగులలో ఎవరికైనా దురద లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని కంపెనీ తన మెయిల్ చేసింది. పనిచేసే ప్రాంతంలో ఎక్కడైనా నల్లులు కనిపిస్తే తెలపాలని పేర్కొంది. ఆఫీసులో పెద్ద సంఖ్యలో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే నల్లులు వ్యాపించి ఉండవచ్చని కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా, 2010లో కూడా ఇదేవిధంగా నల్లుల బెడదతో గూగుల్ ఆఫీసు తాత్కాలికంగా మూతపడింది.