విశాఖపట్నం - హైదరాబాద్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
- మధ్యాహ్నం విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానం
- విమానం రెక్కలో పక్షి ఇరుక్కోవడంతో దెబ్బతిన్న ఇంజిన్ ఫ్యాన్
- చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకువచ్చి ల్యాండ్ చేసిన పైలట్
అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నంలో నిలిచిపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఎయిరిండియా యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.