'కుర్చీ' వివాదంపై స్పందించిన కడప ఎమ్మెల్యే మాధవి
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కుర్చీ వివాదం
- స్పందించిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి
- అధికారుల కుటుంబ సభ్యులు ఉండటంతోనే నిల్చున్నా
- వారిని లేపడం పద్ధతి కాదని భావించా
- సోషల్ మీడియా చర్చపై వ్యంగ్యాస్త్రాలు
వివరాల్లోకి వెళితే, శుక్రవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి అధికారుల ఆహ్వానం మేరకు తాను హాజరయ్యానని మాధవి తెలిపారు. అయితే, తనకు కేటాయించిన ప్రదేశంలో అప్పటికే కొందరు అతిథులు కూర్చుని ఉన్నారని, వారు అక్కడి అధికారుల కుటుంబ సభ్యులేనని తాను గుర్తించినట్లు చెప్పారు. వారిని అక్కడి నుంచి లేపి తాను కూర్చోవడం సంస్కారం కాదని భావించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు నిల్చునే ఉన్నానని వివరించారు. అనంతరం అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఈ చిన్న విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. "ఈ చిన్న విషయంపై సోషల్ మీడియాలో అంత సమయం కేటాయించి పెద్ద చర్చ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.