తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
––
ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వాన..
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి, భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 6,484 క్యూసెక్కులు కాగా అధికారులు రెండు గేట్లు ఎత్తి 4,571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.