కదులుతున్న రైలులో మంటలు.. ప్రయాణికుల పరుగులు.. నెల్లూరులో ఘటన
––
దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును ఆపారు. ప్రయాణికులు కిందకు దిగి దూరంగా పరుగులు తీశారు. బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయని గుర్తించిన సిబ్బంది.. మరమ్మతులు చేశారు. అరగంట తర్వాత రైలు తిరిగి బయలుదేరిందని సిబ్బంది తెలిపారు.