హరిద్వార్ లో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట ఆరుగురు భక్తులు మృతి
- పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- ఆదివారం ఉదయం ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు
- గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆలయం వద్దకు బయలుదేరానని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.