ఇంటర్ స్టూడెంట్స్ ఇబ్బందులే వేరయా .. AIR సిరీస్ !
- ఇంటర్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే 'AIR'
- ర్యాంకుల హడావిడిపై సాగే కథాకథనాలు
- వినోదం - సందేశం కలిసి కనిపించే సిరీస్
- ఈ నెల 3వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్
హర్ష రోషన్ .. భానుప్రతాప్ .. సింధూ రెడ్డి .. జయతీర్థ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 3వ తేదీ నుంచి ఈటీవీ విన్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఇంటర్ స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఇటీవల కాలంలో 'కోర్ట్' సినిమాతో హర్ష రోషన్ కి వచ్చిన క్రేజ్, ఈ సినిమాకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.
ఇంటర్ కుర్రాళ్లను చాలా ఇబ్బంది పెట్టే అంశం ర్యాంకులు. కాలేజ్ లు ర్యాంకుల విషయంలో చాలా హడావిడి చేస్తాయి. ఆ ర్యాంకుల కోసం పేరెంట్స్ అదే పనిగా పిల్లలను ఒత్తిడి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని రూపొందించిన సిరీస్ ఇది. బ్యాక్ బెంచ్ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతూ సరదాగా నవ్విస్తుంది .. ఆలోచింపజేస్తుంది. చూడాలి మరి ఈ సిరీస్ కి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో.