భారీ వృక్షాన్ని పెకలించుకుని తనతో పాటు తీసుకెళ్లిన వరద నీరు... వీడియో వైరల్!
- ఇంటర్నెట్లో సందడి చేస్తున్న వీడియో
- నీటి ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన చెట్టు
- మధ్యలో బ్రిడ్జి అడ్డొచ్చినా ఆగని వైనం
తాజాగా, ఇంటర్నెట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. భారీ వర్షాలతో ఓ నది పొంగి పొర్లుతుండగా, అందులో ఓ భారీ వృక్షం కూడా కొట్టుకొచ్చింది. మధ్యలో ఓ పట్టణం వద్ద బ్రిడ్జి అడ్డొచ్చినా కూడా వరద నీరు ఆ చెట్టును తనతో పాటు తీసుకెళ్లింది. ఇది చూసిన నెటిజన్లు నీటి ప్రవాహానికి ఉన్న శక్తి పట్ల ఆశ్చర్యపోతున్నారు.