ప్రేమించిన అమ్మాయి భర్తను పోగొట్టుకుని తిరిగొస్తే .. ఓటీటీలో 'అభిలాషం'
- మలయాళంలో రూపొందిన 'అభిలాషం'
- మార్చిలో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 23వ తేదీ నుంచి ఓటీటీలో
- సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన డైరెక్టర్
ఈ కారణంగానే మేకర్స్ కూడా అందుకు తగిన కంటెంట్ నే రెడీ చేసుకుంటూ ఉంటారు. అలా రూపొందిన సినిమానే 'అభిలాషం'. ఈ ఏడాది మార్చి 29వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను వదిలారు. సైజూ కురుప్ .. తన్వీ రామ్ .. అర్జున్ అశోకన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ ముగ్గురూ ప్రేక్షకులు బాగా ఎరిగినవారే. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా, సహజత్వం విషయంలో మంచి మార్కులు కొట్టేసింది.
షంజూ జేబా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అభిలాష్ ఓ చిన్నపాటి బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. అతను షెరిన్ అనే యువతిని ప్రేమిస్తాడు. కానీ ధైర్యం చేసి, తన మనసులోని మాటను చెప్పలేకపోతాడు. దాంతో ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతుంది. అయితే హఠాత్తుగా భర్త చనిపోవడంతో ఆ ఊరికి తిరిగొస్తుంది. అప్పుడు అభిలాష్ కీ .. షెరీన్ కి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలేమిటి? అనేది కథ.