కూకట్ పల్లిలో హైడ్రా కూల్చివేతలు.. థ్యాంక్స్ చెప్పిన ప్లాట్ యజమానులు.. వీడియో ఇదిగో!
--
బాధితుల వివరాల ప్రకారం.. హైదర్‌నగర్ డివిజన్లోని సర్వే నెంబర్ 145లో 9 ఎకరాల 27 గుంటల స్థలంలో డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్ విస్తరించింది. 2000 సంవత్సరంలో ఈ లేఅవుట్ లో 79 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలం తనదని శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరి కొంతమందితో కలిసి ఆక్రమించాడు. హైకోర్టుకు వెళ్లి తనకు అనుకూలంగా స్టే తెచ్చుకున్నాడు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని వెంచర్ లోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో న్యాయం కోసం 79 మంది బాధితులు కోర్టుకెక్కారు. గతేడాది సెప్టెంబర్ లో బాధితులకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. శివ దుర్గాప్రసాద్, ఆయన అనుచరులు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. అయినా శివ దుర్గాప్రసాద్ ఖాళీ చేయకపోవడంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు సోమవారం రంగంలోకి దిగి ఆక్రమణలను కూల్చివేశారు.