పురుషులపై నమ్మకం లేదంటూ.. కోర్టు ప్రాంగణంలోనే ఇద్దరు యువతుల వివాహం
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు స్నేహితురాళ్ల వివాహం
- పురుషులపై అయిష్టతతోనే నిర్ణయమన్న యువతులు
- కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఒక్కటైన జంట
- చట్టం అంగీకరించకున్నా కలిసే జీవిస్తామన్న మహిళలు
అయినప్పటికీ, ఆ యువతులు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. పురుషులతో కలిసి జీవించడం తమకు ఇష్టం లేదని, తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా, చట్టం తమ వివాహాన్ని గుర్తించకపోయినా తాము కలిసే జీవిస్తామని దృఢంగా పేర్కొన్నారు. అనంతరం, కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఈ ఘటన, స్వలింగ సంబంధాలు, వివాహాలపై దేశంలో జరుగుతున్న చర్చకు అద్దం పడుతోంది.