బహమాస్ టూర్ లో విషాదం.. భారత సంతతి విద్యార్థి మృతి
- స్నేహితులతో కలిసి ట్రిప్ కు వెళ్లిన ఇండియన్ అమెరికన్
- హోటల్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడ్డ గౌరవ్
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి
మసాచు సెట్స్‌లోని బెంట్లీ యూనివర్సిటీలో జైసింగ్ చదువుతున్నాడు. ఈ వారంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తికావాల్సి ఉంది. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి బహమాస్ టూర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. బహమాస్‌లో వారు బస చేసిన హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర సంఘటనపై బెంట్లీ యూనివర్సిటీ స్పందిస్తూ.. జైసింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. జైసింగ్ కుటుంబసభ్యులకు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.