కన్నప్ప టీమ్‌కి సారీ చెప్పిన శ్రీవిష్ణు.. కారణమిదే!
తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, కానీ కన్నప్ప టీమ్ హర్ట్ అయిందని తెలిసి మీ ముందుకు వచ్చామన్నారు. ఏవైతే ఇబ్బంది కలిగించాయో ఆ సీన్లను తొలగించినట్లు చెప్పారు. అలాగే సినిమాలో కూడా వాటిని తీసేయడం జరుగుతుందని చెప్పి, ఈ వివాదానికి శ్రీవిష్ణు శుభం పలికారు. ప్రధానంగా ఈ చిత్రంలో సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్, వేరే హీరోల చిత్రాల్లోని పలు సీన్స్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు ఈ సందర్భంగా హీరో వెల్లడించారు. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే తమను క్షమించాలని కోరారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామన్నారు.