Tinder Woman's Demands: కాబోయే భర్త ఏడాదికి ‘కనీసం’ 2.5 కోట్లు సంపాదిస్తుండాలట.. టిండర్ లో ఓ యువతి కోరికల చిట్టా

Tinder Womans 18 Demands for a Husband Go Viral

  • టిండర్ లో పరిచయమైన వ్యక్తికి యువతి షరతుల జాబితా
  • కాబోయే భర్తకు ఉండాల్సిన 18 కనీస అర్హతలతో లిస్ట్
  • ఇక మీకు పెళ్లి అయినట్లేనంటూ ఎద్దేవా చేస్తున్న నెటిజన్లు

ఓ యువతి తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన కనీస అర్హతలంటూ 18 షరతులతో కూడిన జాబితాను టిండర్ యాప్ లో పరిచయమైన వ్యక్తికి పంపింది. అతను ఆ జాబితాను రెడిట్ లో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ డిమాండ్లపై భిన్నంగా స్పందిస్తున్నారు.

ఆ యువతి కోరుకుంటున్న లక్షణాల్లో ప్రధానమైనది కాబోయే భర్త వార్షిక జీతం కనీసం 3 లక్షల డాలర్లు (సుమారు రూ. 2.5 కోట్లకు పైగా) ఉండాలి. అంతేకాకుండా, అతను ఉదారంగా ఉంటూ తనను గారాబం చేయాలని, విలాసవంతమైన, ఉన్నతమైన జీవనశైలిని ఇష్టపడాలని కోరింది. ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం, విహార యాత్రలు వంటివి ఇష్టపడాలని పేర్కొంది.

జీతంతో పాటు, తనను గాఢంగా ప్రేమించాలని, తనకే ప్రాధాన్యమివ్వాలని కోరింది. భావోద్వేగ ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, లక్ష్యాలు, క్రమశిక్షణ, కుటుంబానికి విలువివ్వడం, మంచి పరిచయాలు కలిగి ఉండటం వంటి వ్యక్తిగత లక్షణాలను కూడా ఆశించింది. శారీరకంగా ఫిట్ గా, ఆకర్షణీయంగా, చక్కగా తయారై ఉండాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్రచారం కన్నా గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, లైంగిక క్రమశిక్షణ, విధేయత కలిగి ఉండాలని పేర్కొంది. గర్భనిరోధక బాధ్యత కూడా అతనే తీసుకోవాలని చెప్పింది. పనిమనిషి, వంటమనిషి వంటి వారిని ఏర్పాటు చేసి జీవితాన్ని సులభతరం చేయాలని కూడా జాబితాలో చేర్చింది.

ఈ పోస్ట్ రెడ్డిట్ లో వైరల్ గా మారింది. "ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి ఆమెను వెంటనే బ్లాక్ చేస్తాడు", "అలాంటి వారు టిండర్ లో ఎందుకు ఉంటారు?", "ఆమెకు జీవితాంతం పెళ్లి కాదు" అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

Tinder Woman's Demands
Viral Tinder Post
Reddit Post
High Earning Husband
Luxury Lifestyle
Dating Expectations
Marriage Requirements
Social Media Trends
Indian Dating
Online Dating
  • Loading...

More Telugu News