అరంగేట్రంతోనే ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
- అతి పిన్న వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సూర్యవంశీ రికార్డు
- 14 ఏళ్ల 23 రోజుల వయసులో మెగా లీగ్‌లో తొలి అడుగు
- ప్రయాస్ రే బర్మన్ రికార్డు బద్దలు
గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో వైభవ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తుది జట్టులో చోటు దక్కకున్నా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. తొలి బంతినే సిక్సర్ కొట్టి శభాష్ అనిపించాడు. మొత్తంగా 20 బంతులు ఆడిన సూర్యవంశీ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. బీహార్‌కు చెందిన సూర్యవంశీని గతేడాది నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ. 1.10 కోట్లకు దక్కించుకుంది. ఫలితంగా వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడిగానూ రికార్డులకెక్కాడు.