ఇదేందయ్య ఇది.. చాట్ జీపీటీను ఇలా కూడా వాడతారా?.. వైరల్ వీడియో!
ఆ తర్వాత అందులో తియ్యని, ఎర్రగా ఉన్న పుచ్చకాయను గుర్తించాలని ఏఐని కోరాడు. దాంతో కొన్ని పుచ్చకాయలను పరిశీలించాక ఒకదానిని అది సూచించింది. ఏఐ సూచించిన ఆ పుచ్చకాయను కట్ చేసి చూడగా నిజంగానే పండు ఎర్రగా ఉండడం వీడియోలో చూడొచ్చు. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ, ఇప్పుడీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.