దుబాయిలో ఇద్దరు తెలుగోళ్లను దారుణంగా హత్య చేసిన పాకిస్థానీ!
- చంపిన తర్వాత పాకిస్థానీ మతపరమైన నినాదాలు
- మృతుల్లో ఒకరిది నిర్మల్.. మరొకరిది నిజామాబాద్ జిల్లా
- అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు
అదే బేకరీలో పనిచేసే ఓ పాకిస్థానీ పని ఒత్తిడి, మత విద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు సమాచారం. వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.