ఓ దళిత బైక్ మెకానిక్ కు చంద్రబాబు ఆత్మీయ భరోసా... వీడియో ఇదిగో!
- గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు పర్యటన
- ఓ దళిత బైక్ మెకానిక్ తో ఆత్మీయ సంభాషణ
- అక్కడిక్కడే కలెక్టర్ కు ఆదేశాలు
సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు? షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎలా వస్తారు? అని ఆ యువకుడిని సీఎం చంద్రబాబు అడిగారు. అందుకే మరో చోట షాప్ పెట్టించి, నీకు మంచి టూల్స్ కూడా ఇస్తాం అని తెలిపారు.
వెంటనే జిల్లా కలెక్టర్ ను పిలిచారు. యువకుడు ప్రవీణ్ కు మరో మంచి ప్లేస్ లో బైక్ మెకానిక్ షెడ్ కట్టించి, సరైన పనిముట్లు అందించాలని ఆదేశించారు. అతడికి స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇప్పించాలని స్పష్టం చేశారు. ఇల్లు కూడా మంజూరు చేయాలన్నారు.