ఆ హీరోతో నటించాలనేది నా కోరిక: షాలినీ పాండే
- 'అర్జున్ రెడ్డి'తో మంచి గుర్తింపు పొందిన షాలినీ పాండే
- రణబీర్ కపూర్ తో కలిసి నటించాలని ఉందని వెల్లడి
- అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని కితాబు
తాజాగా తనకు ఏ హీరోతో నటించాలని ఉందో షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి నటించాలనేది తన కోరిక అని షాలినీ పాండే చెప్పింది. అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని, నటనలో ఒక మాయ ఉంటుందని తెలిపింది. రణబీర్ తో కలిసి ఒక్క రోజైనా పని చేయాలనేది తన కోరిక అని చెప్పింది. ప్రతి సినిమాలో రణబీర్ నటనలో మార్పు కనిపిస్తుందని కితాబునిచ్చింది.