ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: వైఎస్ అవినాశ్ రెడ్డి
- మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను పరామర్శించిన అవినాశ్
- అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు
- కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపాటు
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను కడపలో అవినాశ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంజాద్ బాషాను అవినాశ్ పరామర్శించారు.
తీవ్రవాది మాదిరి అహ్మద్ బాషాను ముంబైకి వెళ్లి తీసుకొచ్చారని మండిపడ్డారు. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం దారుణమని అన్నారు. తప్పుడు కేసు పెట్టి అహ్మద్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.