పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరీశ్ రావు
- సింగపూర్ లో విద్యాభ్యాసం చేస్తున్న పవన్ తనయుడు
- స్కూల్లో అగ్నిప్రమాదం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్
- త్వరగా కోలుకోవాలంటూ హరీశ్ రావు ట్వీట్
"సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలిసింది. ఈ వార్త తీవ్ర విచారానికి గురిచేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బాధాకరమైన సమయంలో పవన్ కల్యాణ్ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాను" అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.