'అదుర్స్-2' సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తారక్ బిగ్గెస్ట్ హిట్స్ లో 'అదుర్స్' సినిమా ఒకటి
- ఈ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి కామెడీ పండించిన తారక్
- 'అదుర్స్-2' చేయడానికి భయపడుతున్నానన్న ఎన్టీఆర్
ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ... ఏ ఆర్టిస్టుకైనా కామెడీ పండించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే 'అదుర్స్-2' చేయడానికి భయపడుతున్నానని తెలిపారు. నవ్వించడం గొప్ప వరమని చెప్పారు. 'దేవర-2' సినిమా గురించి మాట్లాడుతూ... ఈ సినిమా ఉండదని చాలా మంది అనుకుంటున్నారని... కానీ 'దేవర-2' కచ్చితంగా ఉంటుందని చెప్పారు. 'దేవర' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆదరించారని అన్నారు. ఇది అభిమానులు భుజం మీద మోసిన సినిమా అని చెప్పారు.