ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు... సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
- ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు ఏకగ్రీవం
- నేడు నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
- సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు
అనంతరం నాగబాబు సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబు, పద్మజ దంపతులు సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు... నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగబాబుకు శాలువా కప్పి, వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.
