‘బసవతారకం ట్రస్ట్’ కేసులో లక్ష్మీపార్వతికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
- ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరీ విల్లు ప్రకారం బసవతారకం ట్రస్ట్‌కు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలన్న లక్ష్మీపార్వతి
- విల్లుపై సంతకం చేసిన వ్యక్తి కుమారుడిని సాక్షిగా గుర్తించిన దిగువ కోర్టు
- సివిల్ కోర్టు ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు
1995లో ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరీ విల్లు ప్రకారం బసవతారకం ట్రస్టుకు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని 2009లో లక్ష్మీపార్వతి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. విల్లులో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించిన నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రసాదరావును సాక్షిగా గుర్తించాలని ఆ పిటిషన్‌లో లక్ష్మీ పార్వతి కోరారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విల్లు నిజమేనని, తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని జేవీ ప్రసాదరావు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనను సాక్షిగా విచారించేందుకు సివిల్ కోర్టు అంగీకరించింది. అయితే, ఈ ఆదేశాలను బసవతారకం ట్రస్ట్, నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ హైకోర్టులో సవాలు చేశారు. నిన్న విచారించిన న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.