చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా తెరపైకి ఇద్దరి పేర్లు!
- చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా
- నిన్న సినీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన పూజా కార్యక్రమం
- ఈ చిత్రంలో హీరోయిన్ గా తెరపైకి ఆదితి రావు హైదరి, పరిణీతి చోప్రా పేర్లు
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆదితి రావు హైదరి పేరు తెరపైకి వచ్చింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను అనిల్ రావిపూడి సంప్రదించినట్టు కూడా చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో కానీ... ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. వీరిద్దరిలో ఎవరు మెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేస్తారనేది వేచి చూడాలి.
ఆదితి రావు హైదరి
పరిణీతి చోప్రా